విజ్ఞాన భాండాగారాలుగా విరాజిల్లుతున్న జిల్లాలోని గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. కలెక్టర్ పీ ప్రావీణ్య ప్రత్యేక చొరవతో మండలకేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధి, మరమ్మతులకు రూ. 22.19 లక్షలు మంజూరయ్యాయి.
ఈ నిధులతో జిల్లాలోని వరంగల్ కేంద్రీయ గ్రంథాలయం, పర్వతగిరి, కరీమాబాద్, రంగశాయిపేట, ఉర్సు, నర్సంపేట, ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, గురిజాల గ్రంథాలయాల భవనాలకు మరమ్మతులు, నామ ఫలకాలతోపాటు కళాత్మకంగా గోడలకు వేసిన పెయింటింగ్స్ ఆకట్టుకున్నాయి.
– వరంగల్, జూన్ 13 (నమస్తే తెలంగాణ)