జనగామ, మే 21 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి శివారులోని వానకొండయ్య గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ ప్రతినిధులు గురువారం జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతిపత్రం అందజేశారు. కడవెండి గ్రామస్తులు, వానకొండయ్య గుట్ట పరిసర తండాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, భక్తులు గుట్టపై జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆధారాలను ఫొటోలతో సహా చూపించారు.
సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అక్రమ మైనింగ్‌పై చట్టబద్ధంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎర్రబెల్లి వెంట పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి, తీగల దయాకర్, బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్, బసవ మల్లేశ్, ఏల సుందర్, చింత రవి, సుడిగెల హనుమంతు, పాము మోహన్, జాటోత్ ఆనంద్, రత్నాకర్‌రెడ్డి, ధరావత్ రామ్‌సింగ్, ఖాసీం, బసవ వెంకన్న, బానోత్ రాజన్న, కత్తుల సోమిరెడ్డి, మల్లారెడ్డి, వంగ అర్జున్, కోతి ప్రవీణ్, మహేశ్, గడ్డం రాజు తదితరులున్నారు.