సుబేదారి, సెప్టెంబర్ 29 : కలప, అటవీ ఉత్పత్తుల తరలింపు కోసం కేంద్ర అటవీ శాఖ వన్ నేషన్-వన్ పర్మిట్ పేరిట ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ అటవీ అధికారుల అక్రమ వసూళ్ల దందా ఆగడం లేదు. గతంలో కలపకు మా న్యువల్‌గా పద్ధతిలో పర్మిట్లు ఇచ్చేందుకు టింబర్ డిపోలు, సామిల్ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకునేవారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానం ఉన్నా వారిలో మార్పు రాలేదని వారు వాపోతున్నారు.
హనుమకొండ జిల్లాలో 100 వరకు టింబర్ డిపోలు, సామిల్స్ ఉన్నాయి. గృహావసరాలకు వినియోగించడానికి టేకు, ఇతర కలప కోసం ఫారెస్ట్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. ఇందుకోసం టింబర్ డిపో య జమాని తప్పనిసరిగా స్థానిక రేంజ్ ఆఫీసర్ ద్వారా పర్మిట్ తీసుకొని కలప విక్రయించాలి. పర్మిట్ కోసం రూ. 100 చెల్లించి నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టం పోర్టల్‌లో డిపో లైసెన్స్, ఫోన్ నంబర్, కలప ర కం, సైజు, రవాణా చేసే ప్రాం తం తదితర వివరాలను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలి.
హనుమకొండ జిల్లా అటవీశాఖ అధికారులు కలప పర్మిట్లకు టింబర్ డిపో, సామిల్ య జమానుల నుంచి అక్రమంగా డబ్బులు వ సూలు చేస్తున్నారు. పర్మిట్ జారీచేయాల్సిన రేంజ్ ఆఫీసర్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే సర్టిఫై చేసినట్లు ఆన్లైన్లో చూపించి, సంబంధిత టింబర్ డిపో యజమాని నుంచి ఒక్కో పర్మిట్‌కు రూ. 300 నుంచి రూ. 500 తీసుకున్న తర్వాత నే అప్రూవల్ కోసం పైల్‌ను పైస్థాయి అధికారికి పంపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో హనుమకొండ అటవీ శాఖ కా ర్యాలయంలో పర్మిట్ ఇచ్చే సెక్షన్ సిబ్బంది కి, రేంజ్ ఆఫీసర్లకు మధ్య పంపకాల్లో విభేదాలు వచ్చాయి. ఆన్లైన్ డాటా చేసే కం ప్యూటర్ సిబ్బందికి ఒక్కో పర్మిట్‌కు రూ. 30 మాత్రమే ఇస్తుండడంతో వాటిని పెం డింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం దా నిని రూ. 50కి పెంచి టింబర్ డిపోల నుంచే వసూలు చేస్తున్నట్లు యజమానులు చెబుతున్నారు. ఈ దందా ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతున్నట్లు సమాచారం.