వరంగల్ చౌరస్తా: వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దుబ్బ శ్రీనివాస్‌పై ఇంతేజార్గంజ్ పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన శ్రీనివాస్‌ను సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెంటాడారు. ఆయన తన బంధువుల ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. గుడిసె వాసుల నుండి అక్రమ వసూళ్లు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తమ అనుచరులతో తప్పుడు ఫిర్యాదు చేయించారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తద్వారా దుబ్బ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పార్టీ మారాలని మంత్రి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మంత్రి ముఖ్య అనుచరుడి ఆదేశాలతోనే పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.