ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ ఆదాయం, టిక్కెట్ల ద్వారా రూ.20 లక్షల 70 వేల 641 ఆదాయం వచ్చిందని శుక్రవారం ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు. 69 రోజులకు గాను 23 హుండీలను తెరిచి లెక్కించగా రూ.4 లక్షల 37 వేల, 108 రూపాయలు వచ్చింది. వివిధ రకాల టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 16 లక్షల 33 వేల 533 రూపాయాలు సమకూరింది.
హుండీ, టిక్కెట్ల ద్వారా దేవాలయానికి వచ్చిన మొత్తం ఆదాయం రూ.20 లక్షల 70 వేల 641 రూపాయాలు వచ్చింది. ఈ లెక్కింపునకు పరిశీలకులుగా డి అనిల్ కుమార్, ఈవో కందుల సుధాకర్, ఆలయా చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, కానిస్టేబుల్స్ పీ రమేశ్, రాజు, జి పరమేశ్వరి, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవాసమితి మహబూబాబాద్, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.