పోచమ్మమైదాన్, నవంబర్ 15: ‘మీ ఇంటి బిడ్డగా వస్తున్నా. నన్ను ఆశీర్వదించండి. అధిక మెజార్టీతో గెలిపించండి’ అని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. 13వ డివిజన్లో నరేందర్‌కు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి ఆధ్వర్యంలో దేశాయిపేట నవయుగ కాలనీలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటికీ వెళ్లిన నన్నపునేనికి మహిళలు ఎదురొచ్చి బొట్టుపెట్టి మంగళహారతులతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. మరోపక్క డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, అభివృద్ధికి సంబంధించిన ప్లకార్డులతో ప్రజలు హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, రాష్ట్ర సరోగసి మెంబర్ డాక్టర్ హరిరమాదేవితో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. తూర్పు నియోజకవర్గాన్ని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పును కనీవినీ ఎరుగని తీరులో అభివృద్ధి చేశానని, గత ఎమ్మెల్యేకు ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం చేతగాక, ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మరోసారి కేసీఆర్‌ను సీఎం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, బోగి సువర్ణ, వస్కుల బాబు, కావటి కవిత, బస్వరాజు చిన్న కుమారస్వామి, నాయకులు తుమికి రమేష్‌బాబు, మావురపు విజయభాస్కర్‌రెడ్డి, చంద్రశేఖర్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
గిర్మాజీపేట/పోచమ్మమైదాన్: ప్రజా సంక్షేమ ప్రభుత్వానికే ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకుడు ఎండీ రజాక్, కాంగ్రెస్ యూత్ నాయకుడు విశ్వనాథ్ అశోక్ శివనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో నరేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ కాకతీయ ట్యాక్సీ స్టాండ్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే నన్నపునేనికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశాయిపేటలో ఎమ్మెల్యే నరేందర్‌ను కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసిన ఆమోద పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో మూకుమ్మడిగా 50 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. వారికి నరేందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, కృతజ్ఞతలు తెలిపారు.
గిర్మాజీపేట: వరంగల్ 33వ డివిజన్ పెరుకవాడలో బీఆర్ఎస్ డివిజన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయాన్ని కార్యకర్తలు వినియోగించుకొని ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ నేత ముష్కమల్ల సుధాకర్, డివిజన్ ఇన్చార్జి వడ్డె కోటేశ్వర్, డివిజన్ అధ్యక్షులు మీరిపెల్లి వినయ్‌కుమార్, దోమకొండ రమేశ్, దోరం ఆనంద్, మణెమ్మ, ఉపేంద్ర, లక్ష్మి, ప్రసాద్, రాకేశ్, ముద్దసాని శ్రీను, నాయకులు పాల్గొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కే తమ సంపూర్ణ మద్దతు అని 26వ డివిజన్లోని సాయి, అమ్ము రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులు ముక్తకంఠంతో వాగ్దానం చేశారు. బుధవారం రాత్రి కార్పొరేటర్ బాలిన సురేశ్ ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశానికి నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు నరేందర్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గత ఎన్నికల్లో మీరు సహకరిస్తే నేను ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చానని నన్నపునేని అన్నారు. కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రోడ్లు, డ్రైనేజీలు, బస్‌స్టేషన్, రింగ్‌రోడ్, 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం.. ఇలా అనేక అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రెసిడెన్సీ అధ్యక్షుడు గట్టు శ్రీధర్, సెక్రటరీ గొరిశెట్టి శ్రీనివాస్, కోశాధికారి అడ్డగోడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు తాటికొండ ప్రసాద్, మంచాల ప్రసాద్, సముద్రాల వెంకటేశ్వర్లు, పార్లాటి చంద్రమౌళి, గుమ్మడవెళ్లి రతీశ్, ఇట్టం సురేశ్, గోపాల్‌రావు, ఉమాపతి, విద్యాసాగర్, జయశ్రీ, దీపక్, లలిత, పద్మ, వాణి, హేమలత, భారతి, లలిత పాల్గొన్నారు. అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నన్నపునేని వెంటే మేమంతా ఉంటామని గంగపుత్రులు ప్రతిజ్ఞ చేశారు. రాజశ్రీ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేందర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, కారు గుర్తుకే ఓటు వేస్తామన్నారు.