బచ్చన్నపేట, నవంబర్ 21 : “ప్రత్యర్థులు నన్ను లోకల్ కాదంటున్నారు..నేను పక్కా లోకల్ వ్యక్తిని.. స్వయంగా సీఎం కేసీఆర్ నన్ను ఆశీర్వదించి జనగామకు పంపిండు.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనగామలోనే ఉండి మీకు సేవ చేస్తా.. మీతోనే శభాష్ పల్లా అనిపించుకుంటా”.. అని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గో పాల్‌నగర్, బచ్చన్నపేట, ఆలింపూర్, వీఎస్సార్.నగర్, క ట్కూర్, బండనాగారంలో ఇంటింటా ప్రచారం చేపట్టా రు. ప్రతి గ్రామం లో డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు విన్యాసా లు, పటాకుల పేలుళ్ల మధ్య, పూలు చల్లుతూ ఘనస్వాగ తం పలికారు. ఆయా గ్రామాల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మా ట్లాడుతూ నాలుగు పార్టీలు మారిన కాంగ్రెస్ అభ్యర్థి కొ మ్మూరి ప్రతాపరెడ్డికి నన్ను విమర్శించే హక్కు లేదు. నేను ఎమ్మెల్యే కాకముందే సీఎం దగ్గర రూ.1.50కోట్లు తెచ్చిన, మీరు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూ.1500కోట్లు తెస్తానన్నారు. బచ్చన్నపేటలో జూనియర్, పాలిటెక్నిక్ కళాశాల తెప్పిస్తానన్నారు. సీఎం కేసీఆర్‌కు బచ్చన్నపేట అంటే అమితమైన ప్రేమ అన్నారు. అందుకే నాడు కరువుతో కొట్టుమిట్టాడిన బచ్చన్నపేట నేడు గోదావరి జలాలతో కళకళలాడుతుందన్నారు. గుడి చెరువు నీటితో నిండుకుండలా ఉందన్నారు. పేద ప్రజలకు ఘట్కేసర్లోని తన సొంత ఆసుపత్రి నీలిమాలో ఉచితంగా వైద్యం అందించేందుకు సిద్ధం గా ఉన్నామన్నారు.
చేనేతకు ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. అర్హులందరికీ గృహలక్ష్మి అందిస్తామన్నారు. మ త్స్యకారులకు అండగా నిలుస్తున్నామన్నారు. బుడిగ జం గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. బచ్చన్నపేటలో అతిథిగృహం మరమ్మతుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ మాటలకు నమ్మి మోసపోవద్దన్నారు. బచ్చన్నపేటలో మార్కెట్‌యార్డు మంజూరు చేపిస్తామన్నారు. ప్రభుత్వం స్థలంలో ఫంక్షన్‌హాలు కట్టిస్తామన్నారు. 30పడకల ఆసుపత్రిని 50పడకలుగా అప్‌గ్రేడ్ చేయిస్తామన్నారు. ఆలింపూర్, వీఎస్సార్.నగర్, కట్కూర్, బండనాగారంలో సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తానన్నారు. ఇప్పటి వరకు సబ్బండ వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ ముందుకు సాగుతుందన్నారు. మరిన్ని పథకాలు ప్రజలకు చేరాలంటే కారుగుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల స ర్పంచులు, ఎంపీటీసీలు వడ్డేపల్లి మల్లారెడ్డి, హరికృష్ణ, నరె డ్ల బాల్‌రెడ్డి, నర్సిములు, బాల్‌రెడ్డి, శ్రీనివాస్, కోనేటి స్వా మి, చిట్టిబాబు, ముశిని సునీతారాజుగౌడ్, ఎంపీపీ బావం డ్ల నాగజ్యోతీకృష్ణంరాజు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, అజీమ్, గోపి, వెంకటేశ్వర్డ్డి, రాజు, వెంకట్, శివరాత్రి కవిత, రాజనర్సు, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ముక్కె ర తిరుపతిరెడ్డి, నరేందర్, షబ్బీర్, ఉపేందర్‌రెడ్డి, గుర్రపు బాలరాజు, సిద్దిరాంరెడ్డి, కొండి వెంకట్‌రెడ్డి, జావీద్, మహేందర్‌రెడ్డి, సిద్ధ్దారెడ్డి, ఫిరోజ్, కావ్యశ్రీరెడ్డి, ఖలీల్, వెంకట్‌గౌడ్, లక్ష్మన్‌గౌడ్, నీల రమేశ్ పాల్గొన్నారు.
కొడవటూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంగళవారం పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ ఆత్కూరి రమేశ్ సహా వెంకట్రె డ్డి, మ్యాక చిరంజీవి, గణేశ్, భానుచందర్, హరికుమార్, నీల సిద్ధులు, భాస్కర్ రెడ్డి, అశోక్‌తోపాటు 90శాతం యువకులు బీఆర్ఎస్లో చేరారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మా ట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములు కా వాలన్న ఆశయంతో పార్టీ లో చేరడం అభినందనీయమని అన్నారు. పని చేస్తున్న ప్రభుత్వానికే పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కరికె కరుణాకర్, మినలాపురం కనుకయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.