అరూరి చుట్టూ హైడ్రామా
బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ చుట్టూ హైడ్రామా నడిచింది. తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెత్తనం చెలాయించడం.
- దళిత మాజీ ఎమ్మెల్యేపై బీజేపీ పెత్తనం
- తమ పార్టీలో చేరాలని పట్టు
- కారులోంచి లాగి దౌర్జన్యం
- తోపులాటలో చినిగిన రమేశ్ అంగీ
- ఉదయం నుంచీ ఉద్రిక్తత
నయీంనగర్, జనగామ రూరల్, మార్చి13 : బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ చుట్టూ హైడ్రామా నడిచింది. తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెత్తనం చెలాయించడం, హైదరాబాద్ వెళ్తున్న ఆయనను అడ్డుకొని కారులోంచి లాగి చొక్కా చినిగేలా చేయడం.. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం10గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ప్రారంభానికి ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకన్న చేరుకుని రమేశ్‌తో మాట్లాడుతున్న క్రమంలో బీజీపీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి వాగ్వాదానికి దిగారు. తర్వాత ఎర్రబెల్లి తన కారులో రమేశ్‌ను హైదరాబాద్ తీసుకెళ్తుండగా జనగామ మండలం పెంబర్తి వద్ద బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. బారికేడ్లు, వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు.
అంతేకాకుండా కారులోంచి రమేశ్‌ను బయటకు లాగి గుంజుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో అరూరి అంగీ చినిగింది. వారిని విదిలించుకొని రమేశ్ మాట్లాడుతూ ‘నన్ను ఎవరూ బలవంతగా తీసుకుపోతలేరు, నా వ్యక్తిగత పనిమీద వెళ్తున్నా’ అని చెప్పినా బీజేపీ నాయకులు వినకుండా హంగామా చేశారు. విషయం తెలిసి పెంబర్తికి చెందిన కొందరు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని బీజేపీ నాయకుల చేరలోంచి రమేశ్‌ను విడిపించి హైదరాబాద్‌కు పంపించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

