హుజూరాబాద్/ హుజూరాబాద్ టౌన్/ జమ్మికుంట/ హుజూరాబాద్ రూరల్/ ఇల్లందకుంట/ వీణవంక, నవంబర్ 17: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ జన సంద్రమైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. పట్టణానికి నలువైపులున్న రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పట్టణం మొత్తం సభకు వచ్చిన జనంతో గులాబీమయమైంది. డిగ్రీ కళాశాల మైదానంలో ఇసుకేస్తే రాలనంత జన సందోహమైంది. తమ అభిమాన నాయకుడి ప్రసంగం వినేందుకు ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, డీసీఎంలు, ద్విచక్ర వాహనాలపై స్వచ్ఛందంగా తరలివచ్చారు.
మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద ఎత్తున జెండాలు చేతబూని ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. జై కౌశికన్న’ అంటూ నినాదాలు చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభికులకు బీఆర్ఎస్ వలంటీర్లు తాగేందుకు నీళ్ల ప్యాకెట్లను అందించారు. ప్రముఖ కళాకారుడు మిట్టపెల్లి సురేందర్ ఆధ్వర్యంలో కళాకారుల బృందం ఆట, పాటలు అలరించాయి. ముఖ్యంగా ‘దేఖ్లేంగే.., రామక్క..’ పాటలు ఉర్రూతలూగించాయి. కళాకారులతో పాటూ ప్రజలు కూడా నృత్యాలు చేశారు. ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగింది. సభలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపల్ అధ్యక్షులు తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, గందె రాధిక, నాయకులు పాల్గొన్నారు.
వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని 26 గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా ప్రజా ఆశీర్వాద సభకు తరలివెళ్లారు. ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ట్రాలీల్లో సుమారు 15 వేల మంది బయలుదేరగా, గ్రామాలు ‘జై బీఆర్ఎస్’ నినాదాలతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రఘుపాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా, మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, వీరారెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలకిషన్‌రావు, సింగిల్‌విండో మాజీ చైర్మన్ గంగాడి తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు ఉన్నారు.
ఇల్లందకుంట మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు ప్రజా ఆశీర్వాద సభకు తరలివెళ్లారు. ప్రతి గ్రామం నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, బైక్‌లపై బయలుదేరారు. సీఎం సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ సర్పంచులు రాజిరెడ్డి, రజితావాసుదేవరెడ్డి, మొగిలి, రాజు, దిలీప్‌రెడ్డి, వెంకటస్వామి, వనమాలావాసు, మానసామహేందర్, బీఆర్ఎస్ నాయకులు, తిరుపతిరెడ్డి, మల్లయ్య, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, ఓదెలు, చిన్నరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్లు కందాల కొమురెల్లి, ఉడుత వీరస్వామి, మాజీ సర్పంచులు రమేశ్, కుమారస్వామి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
హుజూరాబాద్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా వేలాది మంది ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎం వ్యాన్, ద్విచక్రవాహనాల్లో జమ్మికుంటలో ప్రజాఆశీర్వాద సభకు తరలివెళ్లారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలివెళ్లడానికి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులు వాహనాలను ఏర్పాటు చేశారు.