డోర్నకల్, జూలై 25: భర్త మరణం తట్టుకోలేక భార్య గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సత్తి ముత్తయ్య(80) కొద్ది కాలంగా అనా రోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.
గురువారం ఉద యం అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగా ముత్తయ్య భార్య యశోదమ్మ(70) మృతదేహం వద్ద రోదిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. వెంటనే ఖమ్మం దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. వీరికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వృద్ధ దంపతులకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.