‘లోక: చాప్టర్ 1’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది మలయాళీ భామ కల్యాణి ప్రియదర్శన్. ఈ సూపర్ ఉమెన్ ఫాంటసీ థ్రిల్లర్‌లో ఆమె అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. గత ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘లోక: చాప్టర్ 1’ రికార్డులు సృష్టించింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఓ ఈవెంట్లో పాల్గొన్న కల్యాణి ప్రియదర్శన్ సీక్వెల్లో తాను భాగమవుతున్నానని వెల్లడించింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్‌లో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని, సీక్వెల్లో విజువల్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుందని.. కథ, కథనాలు మరింత ఉత్కంఠను పంచుతాయని తెలిపింది.