పవన్ మహావీర్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అమ్మా..నాకు ఆ అబ్బాయి కావాలి’. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జి.శైలజా రెడ్డి నిర్మిస్తున్నారు. సుహాన కథానాయిక. ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.
ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని, సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని, మరో కథానాయికను త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు తెలిపారు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, రోహిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శివాల ప్రభాకర్.