‘ఇండియన్ ఏవియేషన్ ఫోరమ్’ నుంచి ఇటీవల వచ్చిన ఓ పోస్ట్.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. అందులో.. ఒక పిల్లాడు విమానం సీటు ట్రేపై ఎమోజీ స్టిక్కర్లను అతికిస్తూ కనిపించాడు. చూసేందుకు చిన్న పిల్లాడు ముద్దుగా ఆడుకుంటున్నట్లే ఉన్నది. కానీ, తమ బిడ్డ అలా పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తుంటే.. అతని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అంటూ.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నిపుణులు కూడా.. ఈ విషయంపై పెద్ద చర్చకే తెరలేపారు.
నిజానికి ఇలాంటి సంఘటనలు మన దగ్గర నిత్యకృత్యం. బస్సు, రైలు సీట్లను చింపేయడం; పబ్లిక్ పార్కుల్లోని వస్తువులను ధ్వంసం చేయడం; చారిత్రక కట్టడాలపై రాతలు రాయడం.. ఇలాంటివన్నీ ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటాయి. తల్లిదండ్రులు మాత్రం.. దీన్ని పిల్లల చేష్టలుగానే చూస్తుంటారు. కానీ, ఇలాంటి అలవాట్లను వారి భవిష్యత్ కోణంలోనూ చూడాలని నిపుణులు అంటున్నారు. అందుకే, పిల్ల చేష్టలు మితిమీరితే.. వాటిని మొగ్గలోనే తుంచివేయాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేసే పిల్లల్ని హెచ్చరించడం, వారిని అడ్డుకోవడం క్రూరత్వం కాదనీ, దాన్ని సామాజిక బాధ్యతగానే చూడాలని
చెబుతున్నారు.
సామాజిక బాధ్యతపై పిల్లలకు బాల్యం నుంచే అవగాహన కల్పించాలి. ఇంట్లో వస్తువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. బయటి వస్తువులనూ అలాగే చూడాలని పిల్లలకు వివరించాలి. ఆయా వస్తువులు, ఏర్పాట్లు అందరి కోసం ఉన్నవేననీ, వాటిని పాడు చేయకూడదనీ చెప్పాలి. అలా పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం వల్ల ఇతరులకు కలిగే ఇబ్బంది, దానిని బాగు చేయడానికి అయ్యే ఖర్చు గురించి కూడా అవగాహన కల్పించాలి. ఇందుకోసం చిన్నచిన్న ఉదాహరణలతో వారికి అర్థమయ్యేలా చేయాలి. ఇక ప్రయాణాలు, పబ్లిక్ ప్రదేశాలను సందర్శించేటప్పుడు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం! చిన్న పిల్లలకు బోర్ కొట్టినప్పుడో, ఏదో ఒకటి చేయాలనిపించినప్పుడో.. ఇలాంటి పనులు చేస్తుంటారు.
కాబట్టి, సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు కలరింగ్ బుక్స్, స్టోరీ బుక్స్, వారికి ఇష్టమైన చిన్న బొమ్మలను వెంట తీసుకెళ్లాలి. వారు ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు.. వాటితో ఆడుకునేలా చూడాలి. ఇక పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించే పని చేస్తుంటే.. వెంటనే సున్నితంగా వారించాలి. అలా చేయడం ఎందుకు తప్పో వివరించాలి. చెప్పినప్పటికీ తప్పును పునరావృతం చేస్తుంటే.. దానిని సరిదిద్దే బాధ్యత కూడా వారికే అప్పగించాలి. ప్రజల
వారిచేత దానిని శుభ్రం చేయించాలి. ఇలాంటి శిక్షణ వల్ల.. తాము చేసిన పని వల్ల ఎంత
కష్టం కలుగుతుందో వారికి అర్థమవుతుంది. చిన్నప్పుడే ఇలాంటి సామాజిక నియమాలను నేర్చుకోవడం వల్ల బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు.