వరంగల్ : మరోసారి భార్యకు ఆడపిల్ల జన్మనిస్తుందన్న సమాచారంతో భార్యను, మరో ఇద్దరు కూతుళ్లను హత్యచేసిన భర్తను, ఆయనకు సహకరించిన మరో 9 మందిని వరంగల్ ( Warangal ) పోలీసులు అరెస్టు ( Arrest ) చేశారు. ఈనెల 1న వరంగల్ పోలీసు కషనరేట్ పరిధిలోని ఐనవోలు మండలం , ఫున్నెలు గ్రామం స్విమింగ్ పూల్‌లో హత్యకు గురైన భార్య, ఇద్దరు ఆడపిల్లలు సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలనఉ హనుమకొండలోని సీపీ కార్యాలయంలో పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ( CP Sun Preet Singh) నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఫున్నెలు గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్ తన భార్య ఫరహాత్ గర్భం దాల్చడం తో ఇటీవల కుటుంభ సభ్యులు కలిసి, ఇద్దరుమహిళ వైద్యులు లింగ నిర్ధారణ చేయడంతో, మళ్లీ ఆడపిల్ల అని తేలింది.
ఇదే సమయంలో ప్రధాన నిందితుడు అజారుద్దీన్ దూరపు మైనర్ బాలిక పై కన్నేసి, ప్రేమిస్తున్నానని , పెళ్లి చేసుకుంటాను కోరాడు. అయితే ఆమె నీకు ఇప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారనిని పెళ్లికి నిరాకరించింది. భార్య, ఆడపిల్లలు ఉన్నందునే దూరపు బాలిక పెళ్లికి అంగీకరించడం లేదని కక్షతో ఈనెల 1న రాత్రి ఐస్ క్రీమ్ తినిపిస్తానని భార్య, ఇద్దరు పిల్లలను నమ్మించి కారులో ఫున్నెలులో అతను నిర్వహిస్తున్న స్విమింగ్ పూల్‌కు తీసుకెళ్లాడు.
సీసీ కెమెరాలకు ఉన్న కరెంట్ తీసేసి, ముగ్గురిని స్విమింగ్ పూల్‌లో నెట్టేశి ముగ్గురు చనిపోయారని నిర్ధారించుకున్న తరువాత, ప్రమాదవశాత్తు భార్య, పిల్లలు చనిపోయారని నిందితుడు అజారుద్దీన్ ప్రచారం చేశాడు. ఈ సంఘటన పై పోలీసులు ఆధునిక టెక్నాలజీతో విచారణ చేపట్టి హత్యగా నిర్ధారించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు, భర్త యండి అజారుద్దీన్, కుటుంబ సభ్యులు ఫరోద్దీన్, చాంద్ పాషా, సలిహా, లింగ నిర్ధారణ చేసిన బశిక స్రవంతి, బాలే పార్థు, బొమ్మెర మనోహర్, లింగాల నరేష్, కొండపర్తి సాట్ల రాజు, భద్రు ఉన్నారని, మరో ఇద్దరు నిందితులైన వైద్యులు పూర్ణిమ, రవళి పరారీలో ఉన్నారని సీపీ పేర్కొన్నారు.