నెల్లికుదురు, జూన్ 17 : మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన సోమవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటు చేసుకుంది. తోర్రూరు సీఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హేమ్లాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఇస్రా తండాకు చెందిన బానోత్ భద్రు సోమవారం రాత్రి మద్యం మత్తులో తన భార్య బానోత్ రంగమ్మ (55) నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి హత్య చేశాడు.
గమనించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసినట్లు సీఐ తెలిపారు. మృతురాలి కూతురు వాంకుడోత్ శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు.