వరంగల్ చౌరస్తా: వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి భారీగా గుట్కాలు, ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకున్నారు. శుక్రవారం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పిన్నవారి వీధిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఆర్ ఆర్ గుట్కా 860 ప్యాకెట్లు స్వాధీనం చేసుకొన్నారు.
టిని విక్రయిస్తున్న నిందితుల్లో ఒకరు రాజ్ పురోహిత భవాని సింగ్ (40) ను అదుపులోకి తీసుకున్నట్లు, మరో నిందితుడు రాజ్ పురోహిత జబ్బార్ సింగ్ (45) పరారీలో ఉన్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత గుట్కాలను స్థానిక పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఎసిపి మధుసూదన్ తెలిపారు. పట్టుబడిన గుట్కాల విలువ సుమారు నాలుగు లక్షల ముప్పై వేల వరకు ఉంటుందని తెలిపారు.