భూపాలపల్లి రూరల్, మే 01 : భూపాలపల్లి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ప్రకృతి ప్రకోపానికి అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. బుధవారం రాత్రి వీచిన గాలివాన బీభత్సానికి అనేక ఇల్లు ధ్వంస మయ్యాయి. చెట్లు విరిగి రోడ్లపై పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
రాత్రి నుండి విద్యుత్ అధికారాలు శ్రమించినా ఇప్పటివరకు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.