ఖిలావరంగల్ : వరంగల్ శివనగర్‌లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి వేటూరి పారిజాతం, దేవేంద్రాచారి దంపతుల ఇల్లు తగులబడింది. కట్టుబట్టలు మినహా ఇల్లంతా అగ్నికి ఆహుతి కావడంతో కుటుంబం పూర్తిగా నిరాశ్రయంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక నాయకుడు పగడాల సతీష్ బాధితులను పరామర్శించారు.
వారికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందేవిధంగా ఘటనకు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు అబ్బోజు తిరుపతి, మంద అక్షిత్ పటేల్, మాధవి, రమేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.