ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువజాము నుంచే ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకొన్నారు. పల్లెలు, పట్నాల్లోని వీధులన్నీ రంగులమయమయ్యాయి. ఉదయం నుంచే చిన్నారులు రంగుల డబ్బాలతో దర్శనమిచ్చారు.
యువతీయువకులు కేరింతలు కొడుతూ సందడి చేయగా, చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకొని ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. డీజే పాటలు, బ్యాండ్ మోతలు హోరెత్తగా, డ్యాన్స్‌ల జోరు కనిపించింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, అధికారులు సిబ్బందితో కలిసి సంప్రదాయ రంగులు చల్లుకున్నారు.
– నమస్తే నెట్వర్క్