వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోలీ వేడుకలు(Holi celebrations) ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తీరొక్క రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రధాన కూడళ్లలో డీజే సౌండ్ సిస్టం ఏర్పాటు చేసి నృత్యాలు చేశారు. ఇక చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున హోలీ వేడుకలు జరుపుకొని సంతోషం వ్యక్తం చేశారు. యువకులు డప్పు చప్పుళ్లతో వీధుల్లో తిరుగుతూ హోలీ వేడుకలు నిర్వహించారు. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రాయపర్తి మండలంలో..