ఇక్కడ చెరువులో గుంపులు గుంపులుగా చేరి చేపల కోసం కొంగలు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సాధారణంగా ఎప్పుడూ ఇక్కడ తిరుగాడే కొంగలతో పాటు ఈ సీజన్లో మాత్రమే అరుదుగా కనిపించే సైబీరియన్ వంటి సుదూర ప్రాంత పక్షులు జలవనరులు ఎక్కువున్న ప్రాంతాలను వెతుక్కుంటూ వస్తాయి.
ఈ క్రమంలో నిత్యం నీటితో కళకళలాడే వరంగల్ భద్రకాళీ చెరువుకు రావడంతో ఇప్పుడు మొత్తం ఖాళీ అయి.. రాళ్లు, బురద మట్టి తేలింది. నీటి తరలింపు మొదలైనప్పటి నుంచే మత్స్యకారులు వలలు వేసి ఉన్న చేపలన్నీ పట్టేయడంతో వట్టిపోయింది.
ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఈ కొంగలు.. చేపలు దొరకక ఆకలికి విలవిల్లాడాయి. బురదలో అటూ, ఇటూ వెతుకుతూ ఎక్కడైనా చేపలు కనిపించకపోతాయా.. అని ఆశగా ఎదురుచూస్తున్న అరుదైన దృశ్యాలు ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కాయి.
– వరంగల్ ఫొటోగ్రాఫర్, నవంబర్ 22