ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షం పడింది. వరంగల్ నగరంతోపాటు నర్సంపేటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామ శివారులో తాడిచెట్టుపై పిడుగు పడింది. జనగామ, మహబూబా బాద్‌లో ఓ మోస్తరు వాన పడింది. సీరోలు మండలంలోని మన్నెగూడెం, అందనాల పాడు, చిలుక్కోయలపాడు గ్రామాల్లో జోరు వాన కురిసింది. శాయంపేట మండలంలోని కొత్తగ ట్టు సింగారం సమీపంలో పరకాల జాతీయ రహదారిపై చెట్టు విరిగిపడింది.
కమలాపూర్ మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో ఇండ్లపై కప్పులు లేచిపోయి గోడలు కూలిపోయాయి. చెట్టు కూలడంతో ఇల్లు ధ్వంసమైంది. వర్ధన్నపేట మండలంలోని అంబేద్కర్‌నగర్ గ్రామ సమీపంలో పిడుగు పడి మాగి వంశీ(23), బంగారి హనుమాన్(16) కు గాయాలయ్యాయి. హనుమాన్కు అపస్మారక స్థితికి చేరుకోగా వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి, వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు.
– నమస్తే నెట్వర్క్, జూన్ 13