ఆలయాల్లో ‘కొత్త’ సందడి.. పోటెత్తిన భద్రకాళీ, వేయిస్తంభాల గుళ్లు
నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలను ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే సంబురాలు జోరందుకోగా బుధవారం ఎక్కడికక్కడ కేక్‌లు కట్ చేసి చిన్నపెద్దా ఆడిపాడారు. మహిళలు తీరొక్క రంగులతో ఇండ్ల ముందు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. అలాగే ఆలయాల్లో ‘కొత్త’ సందడి కనిపించింది.
హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, భద్రకాళీ, రామప్ప సహా ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేలాదిగా తరలివచ్చిన జనం దర్శనం కోసం బారులు తీరారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో ఓరుగల్లు కోటతో పాటు ఖుష్‌మహల్, ఏకశిల పార్క్ పర్యాటకులతో కిటకిటలాడాయి.
– నమస్తే నెట్వర్క్, జనవరి 1