Hanumakonda | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 8: 62వ డివిజన్లోని సోమిడి, విష్ణుపురి మీదుగా వచ్చే డ్రైనేజీ నీరు రెహమత్నగర్ను ఆనుకుని ఉన్న ఎఫ్‌సీఐ గోదాం గుండా వచ్చి భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని నూతన డ్రైనేజీని నిర్మించాలని స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోతున్నారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో కాలనీవాసులు గోడు వెల్లబోసుకున్నారు. డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి విపరీతమైన దుర్వాసన, దోమల వలన డెంగ్యూ, కలుషిత జలాల వినియోగం వలన టైఫాయిడ్ వంటి అనేక విషజ్వరాలు ప్రబలుతున్నాయని వాపోయారు. మున్సిపల్ కమిషనర్‌కు, ఎమ్మెల్యేకు సైతం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, వెంటనే డ్రైనేజీ నిర్మించాలని కోరుతున్నారు. ఈ సమావేశంలో కాలనీవాసులు కె.రాజేష్, ఎండి.హైదర్, సత్యనారాయణ, ఖాజా, సారంగపాణి, ఎండి.ముంతాజ్, ఎండి.అమీద, రఘు, స్వరూప, కవిత, రాంబాబు, ఖలీల్, సిరాజ్, రజాల్, సత్తార్, సర్వర్, గౌస్, మొయిన్, దిల్షద్ రెహమత్తిన్ పాల్గొన్నారు.