పరకాల, డిసెంబర్ 28: గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మసకబారుతున్నా యి. చాలా చోట్ల భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క ప్రభుత్వం మెస్ చార్జీలు రెండింతలు పెంచామని గొప్ప లు చెప్పుకుంటున్నా మరోపక్క నూతన మె బనూ అమలు కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 14 నుంచి ప్రతి గురుకులంలో కొత్త మెనూ ప్రారంభిస్తామని చెప్పి నా పకడ్బందీగా అమలు కావడం లేదనే అరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి.
నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు ఉ దయం టిఫిన్, మధ్యాహ్నం వారంలో రెండు రోజులు నాన్ వెజ్, మిగతా ఐదు రోజుల్లో ప్రతి రోజూ గుడ్డు, పెరుగు, ఓ కూర, టమాట ఆకుకూరతో పప్పు అందించాల్సి ఉంటుంది. సాయంత్రం కూర చట్నీ, సాంబార్, మజ్జిగ తో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. చాలా గురుకులాల్లో మ ధ్యాహ్నం, సాయంత్రం కూర, సాంబార్‌తో విద్యార్థులకు భోజనాన్ని పెడుతున్నారు.
పెం చిన డైట్ చార్జీల ప్రకారం.. 7వ తరగతి విద్యార్థులకు గతంలో నెలకు రూ.950 ఉండగా రూ.1330, 8-10వ తరగతి వారికి రూ. 1100 నుంచి రూ.1540, ఇంటర్ నుంచి పీజీ వారికి రూ.1500 నుంచి 2100లకు పెంచారు. నూతన మెనూ అమలు చేయాల్సి ఉన్నా చాలా గురుకులాల్లో పాత పద్ధతిలోనే భోజనాన్ని అందిస్తుండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మల్లక్కపేట, ఆత్మకూరు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో మెనూ అమలుపై అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రిన్సిపాల్‌ను అడిగితే పిల్లలను టార్గెట్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
సొసైటీ నిబంధనల మేరకే నడుచుకుంటున్నా. కలెక్టర్, సొసైటీ కార్యదర్శి ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలలోకి రెండో శనివారం మాత్రమే విద్యార్థుల విజిటింగ్ కో సం వారి తల్లిదండ్రులకు అనుమతి ఉంది. మిగతా రోజుల్లో అనుమతి లేదు. దీంతో కొద్దిమంది కావాలని నాపై, పా ఠశాలపై విష ప్రచారం చేస్తున్నారు. కొత్త మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నాం.
– కృష్ణకుమారి, ప్రిన్సిపాల్, సోషల్ వెల్ఫేర్ స్కూల్, మల్లక్కపేట, పరకాల