నర్సంపేటరూరల్/ఖిలావరంగల్/గీసుగొండ/రాయపర్తి/చెన్నారవుపేట/పోచమ్మమైదాన్/పర్వతగిరి, సెప్టెంబర్ 14: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం హిందీ దివస్‌ను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రార్థనా గేయాలను హిందీలో ఆలపించారు. హిందీ టీచర్లు విద్యార్థులకు హిందీలో సందేశాలు ఇచ్చారు. నర్సంపేట మండలంలోని గురిజాల జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు హిందీలో ప్రతిభ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో హెచ్ఎం రాంచందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, భాంజీపేట జడ్పీహెచ్ఎస్, లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో వేడుకలు జరిగాయి. వరంగల్ 17వ డివిజన్ స్తంభంపల్లిలోని జడ్పీహెచ్ఎస్లో హిందీ పండింట్ గుండు రమేశ్ విద్యార్థులతో చార్టులు తయారు చేయించారు. హిందీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం పద్మావతి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, రాజు, రమాదేవి, రమేశ్ పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్ర లేఖనం, ఉపాన్యాసం, నృత్యాలు, కవితలు, కృతమేళలు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.
కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయుడు కిశోర్, టీచర్లు కిరణ్మయి, విజయలక్ష్మి, శ్రీనివాస్, రమేశ్, కిషన్, అలిసమ్మ పాల్గొన్నారు. రాయపర్తిలోని ఉన్నత పాఠశాలలో హెచ్ఎం గారె కృష్ణమూర్తి ఆధ్వర్యంలో హిందీ దివాస్ నిర్వహించారు. భారత దేశ ఔనత్యానికి ప్రతీకగా నిలిచే భిన్నత్వంలో ఏకత్వానికి జాతీయ భాష హిందీ ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులకు చిత్రలేఖనం, హిందీ పద్యాలు, వచనాల పఠనం, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు.
అనంతరం హిందీ పండిట్ గుగులోత్ సునీతను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీవీరభధ్రశర్మ, గాదె ప్రవీణ్‌రెడ్డి, రోజారాణి, రాధ, పెదగాని సురేందర్, పీడీ శ్రీనివాస్, కలకోట్ల ప్రభాకర్, కోల దేవేందర్ పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. జల్లి ప్రభుత్వ పాఠశాల, మండలకేంద్రంలోని సిద్ధార్థ గురుకుల పాఠశాలలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం ప్రభాకర్‌రావు, హిందీ టీచర్ బండారు భిక్షపతి, రమేశ్ పాల్గొన్నారు. వరంగల్ కొత్తవాడలోని ప్రభుత్వ ఉన్నత గిర్మాజీపేట పాఠశాలలో హెచ్ఎం నాగమణి ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు.
ఉపాధ్యాయులు దుర్గం రవి, భాస్కర్, రాజు, అఫ్సర్, సంపత్‌కుమార్, రమాదేవి, శకుంతలాదేవి, ఉమాదేవి, కృష్ణ, సురేశ్ పాల్గొన్నారు. హిందీలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన 9వ తరగతి విద్యార్థినులు కీర్తన, దివ్య ఆకట్టుకున్నారు. అలాగే, వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్‌బౌళి ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎం ఎర్రబెల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో పోటీలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు రఫీ, రత్నాకర్‌రావు, రమేశ్ పాల్గొన్నారు. పర్వతగిరిలోని ఉన్నత పాఠశాలలో హెచ్ఎం పాక రమేశ్‌బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో హిందీ టీచర్లు ఎల్.రజిత, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.