హసన్‌పర్తి, జూన్ 6 : అనంతసాగర్ శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో స్నాతకత్సోవ సంబురం నెలకొంది. శుక్రవారం మూడో కాన్వొకేషన్ ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సతీశ్‌రెడ్డి, సినీ సంగీత దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంఎం కీరవాణి చేసిన విశేష సేవలను గుర్తుంచి ఎస్సార్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా కీరవాణి ‘మౌనంగానే ఎదుగమని మొక్కనీకు చెబుతుంది’ అనే పాటను పాడి విద్యార్థుల మనసును దోచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అంకితభావం, క్రమశిక్షణతో మెదిలితే అనుకున్న లక్ష్యం వైపు చేరుతారన్నారు. ఎస్సా ర్యూ చాన్స్‌లర్ వరదారెడ్డి నాకు డాక్టరేట్‌ను ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వరదారెడ్డిని చాన్స్‌లర్‌గా కాకుండా ప్రతి ఒక్కరూ గురువుగా, దేవుడిగా చూడడం చాలా ఆశ్చర్యం వేసిందన్నారు.
అలాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు. తెలుగు సినిమాకు గొప్ప సేవలందించిన సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు ఇదే యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసిందని పేర్కొన్నారు. యూనివర్సిటీ చాన్స్‌లర్ వరదారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకుపోయి దేశం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయా లన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలు అందజేశారు. విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రో చాన్స్లర్లు మధుకర్‌రెడ్డి, మహేశ్, వీసీ దీపక్‌గార్గ్, అర్చనారెడ్డి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇది విద్యార్ధుల జీవితాల్లో ఒక మైలు రాయి. ఇం జినీర్లు ఆవిష్కర్తలు, సమస్యల పరిష్కారకులుగా విద్యార్థులు ప్రపంచ సమస్యలను ఎదుర్కోనే శక్తిని సంతరించుకున్నారు. యూనివర్సిలోమౌలిక సదుపాయాలు, అధ్యాపకుల సేవలు బాగున్నాయి. ఎస్సా ర్ యూనివర్సిటీ గత మూడేళ్లలో నేషనల్ ర్యాంకింగ్‌లో టాప్ 100లో ఉండడం విశేషం. ఇండియాలో విద్యారంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. క్వాంటం టెక్నాలజీ, కృత్రిమ మేధస్సులాంటి రంగాల్లో భారత్ అగ్రగామిగా ఉంది.
– డాక్టర్ సతీశ్‌రెడ్డి, ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు