నర్సంపేట, జూలై 24: తెలంగాణలో ఐటీ విస్తరణకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ శ్రేణుల మధ్య మంత్రి కేటీఆర్ బర్త్‌డే కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో రాష్ర్టానికి అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలిపారు. యువనేత మంత్రి కేటీఆర్ ప్రజా సేవలో ఎప్పడూ ముందుంటారన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశ, విదేశాల నుంచి ఐటీ కంపెనీలను రాష్ర్టానికి రప్పిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, బీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, నామాల సత్యనారాయణ, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, పట్టణ యూత్ అధ్యక్షుడు రాయడి దుష్యంత్‌రెడ్డి, రాయరాకుల సారంగం, పుల్లూరి స్వామిగౌడ్, గోనె యువరాజు, కౌన్సిలర్లు రమాదేవి, ఇందిర, పాషా, రాజు, పద్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గంప రాజేశ్వర్‌గౌడ్, పుట్టపాక కుమారస్వామి, ఇర్ఫాన్, సదానందం పాల్గొన్నారు.