పరకాల, జూలై 24 : రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చురుగ్గా పనిచేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని రెడ్కో చైర్మన్, సోషల్ మీ డియా రాష్ట్ర అధ్యక్షుడు వై సతీశ్‌రెడ్డి సూ చించారు. పట్టణంలోని లలితా కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యూత్, సోషల్ మీడియా ముఖ్య నా యకుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి సతీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజ ల వద్దకు తీసుకెళ్లడంలో సోషల్‌మీడి యా ప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయ త్నాలనుతిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సోషల్ మీడియానే పార్టీకి వెన్నెముక
పార్టీ బలోపేతానికి బీఆర్ఎస్ యూత్, సోషల్ మీడియా శ్రేణులు నిరంతరం కృషి చేయాలని, వారే పార్టీకి వెన్నెముక అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రామాల్లో పార్టీ నిర్మాణం బలంగా ఉందని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. ప్రజలకు నిజాలు ఏవో, అబద్ధాలు ఏవో అర్థమయ్యేలా వివరించాలన్నారు. పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో పరకాల, దామెర, నడికూడ, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, ఖిలావరంగల్, గ్రేటర్ 15, 16, 17 డివిజన్ల బీఆర్ఎస్ నాయకులు, యూత్, సోషల్ మీడియా ప్రతినిధులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి కలిసి కేక్‌ను కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.