నర్సింహులపేట ఏప్రిల్ 30 : రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో రైతన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం అకాల వర్షం కురవడంతో ధాన్యాన్ని తడవకుండా కాపాడేందుకు టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో వర్షానికి తడిసిపోయాయి. మ్యాచర్ రావడంతో బుధవారం కాంటాలు పెడతారన్న సంతోషంలో ఉన్న రైతులకు వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయింది.
వర్షం పడుతుందనే భయంతో ధాన్యాన్ని కాపాడునేందుకు రైతులు నానా తంటాలు పడుతూ అద్దెకు కవర్లు తీసుకవచ్చి ధాన్యం కుప్పలపై కవర్లు కప్పారు. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందుబాటు లో ఉంచాల్సిన టార్పాలిన్ కవర్లు రైతులకు ఇవ్వకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోనుగోలు కేంద్రాలలో టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించే విధంగా చూడాలని కోరుతున్నారు.