కరీమాబాద్, నవంబర్ 17: మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూసేకరణలో భాగంగా రూ. 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిం ది. ఈ మేరకు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని కోరుతూ ఆర్అండ్బీ శాఖ ఎయిర్‌పోర్టు అథారిటీకి లేఖ రాసింది.
గతంలో మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది. దీంతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులుపడ్డాయి. ఇప్పటికే దీని పరిధిలో దాదాపు 696 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం సేకరించనున్న 253 ఎకరాల భూమిని రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల కోసం కేటాయించనున్నారు.