నర్సంపేట, జూన్ 29 : గుండెబోయిన కొమురయ్య మృతి కార్మికోద్యమానికి తీరని లోటని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. నర్సంపేట పట్టణ కేంద్రంలో కార్మిక నాయకుడు గుండెబోయిన కొమురయ్య మృతి చెందాడు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహం పై పూలమాలు వేసి నివాళులు అర్పించిన అనంతరం యువరాజు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల కాలం నుండి కార్మిక వర్గానికి సేవలందిస్తూ అనేక కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి పోరాటాలు చేసిన గుండె బోయిన కొమురన్న మృతి కార్మిక వర్గానికి తీరని లోటు అన్నారు.
నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన కొమరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేగాక వామపక్ష ట్రేడ్ యూనియన్ లో ఉద్యమ ప్రస్థానం ప్రారంభం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ వంతు పాత్ర పోషించాలని కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో కార్మికులను సంఘటితం చేసి స్వరాష్ట్ర సాధన కోసం, కార్మిక హక్కుల కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించారని, కార్మిక హక్కులకు ఎక్కడ రాజీలేని పోరాటం చేసి అనేక సమ్మెలకు నాయకత్వం వహించారన్నారు.
తుది వరకు తాను నమ్ముకున్న కార్మిక వర్గం కోసమే పనిచేసి తుది శ్వాస విడిచారని ఆయన చేతిలో అనేక మంది కార్మిక నాయకులుగా తయారయి నేటికీ కార్మికుల కోసం పనిచేస్తున్నారని నేటి తరం కార్మికులకు కార్మికుల కార్మిక నాయకులకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. వారి కుటుంబానికి కార్మిక వర్గం అండగా ఉంటుందనిన్నారు.