Warangal | కమలాపూర్ : కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో ఇల్లు కిరాయికి కావాలని వచ్చిన దొంగ.. ఆ ఇంట్లో ఉంటున్న వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు లాక్కొని వెళ్లిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఉప్పల్ గ్రామానికి చెందిన సముద్రాల మల్లమ్మ రాయమల్లు అనే వృద్ధురాలి ఇంటికి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఇల్లు కిరాయికి కావాలని అడిగి ముచ్చటించాడు. మాట్లాడుతూనే వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు లాక్కొని పరార్ అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ హరికృష్ణ, కాజీపేట ఏసిపీ ప్రశాంత్ రెడ్డి గ్రామానికి వచ్చి వృద్ధురాలితో మాట్లాడి జరిగిన ఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.