దుగ్గొండి, ఏప్రిల్, 24: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇటీవల జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్ గామ్ ప్రాంతంలో జరిగిన ఘటన ఉగ్రవాదుల పిరికిపందల చర్య అని గిర్నిబావి గ్రామస్తులు పేర్కొన్నారు. గురువారం రాత్రి గ్రామ కూడలిలో మతతత్వ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారతీయులకు సంతాపాన్ని ప్రకటించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం మహిళలు, చిన్నారులు, యువజన సంఘాలు ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సద్ది అయిల్ రెడ్డి, కొనుకటి రాజేందర్, కొట్టూరి రమేష్, అన్న లింగన్న, అంకతి నాగరాజు, మహిళలు మమత, లక్ష్మి, సుజాత, స్వప్న, యువజన సంఘాల సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.