హనుమకొండ చౌరస్తా, జనవరి 12 : జాతీయస్థాయి సెపక్తక్రా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం (జేఎన్ఎస్)లో నాలుగు విభాగాల్లో (టీం, రెగ్యు, డబుల్, క్వాడ్) పోటీలు నిర్వహిస్తున్నారు. మూడోరోజైన ఆదివారం ఉమెన్ రెగ్యు ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారులు కేరళ, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్‌పై 0-2 పాయింట్లతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లారు. ఇటు మెన్ రెగ్యు ఈవెంట్లో రాష్ట్ర క్రీడాకారులు హిమాచల్‌ప్రదేశ్, గోవా, ఒడిశా, కర్ణాటక రాష్ర్టాలపై 0-2 పాయింట్లతో గెలుపొందగా ఢిల్లీపై 2-0తో ఓటమి చెందారు.
శాసన మండ లి వైస్‌చైర్మన్ బండా ప్రకాశ్, సాంబారి సమ్మారావు, పల్లెబోయిన అశోక్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్ నాయక్, తెలంగాణ సెపక్తక్రా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానుగంటి సురేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రిక్కల శ్రీనివాస్‌రెడ్డి, లయన్ హనుమాండ్లరెడ్డి, డాక్టర్ ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, వైఎస్ దాయి, విజయభాస్కర్‌రెడ్డి, జీ సంజీవరెడ్డి, ఎం జగన్నాథస్వామి, కూనమల్ల జితేందర్‌నాథ్, ఆర్వీ రామకృష్ణ, అయోధ్య, జీ ధన్‌రాజ్, జీ రవీందర్ పోటీలను పర్యవేక్షించారు.
Warangal5