భద్రకాళీ ఆలయంలో జర్మన్ పెండల్స్
భద్రకాళీ ఆలయానికి వచ్చే భక్తులు ఎండ, వర్షాల బారిన పడకుండా నీడ కల్పించేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో జర్మన్ పెండల్స్‌ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తన సొంత ఖర్చుతో వేయిస్తున్నారు.
- భక్తుల సౌకర్యార్థం సొంత ఖర్చుతో వేయిస్తున్న
- ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
వరంగల్, మార్చి 27: భద్రకాళీ ఆలయానికి వచ్చే భక్తులు ఎండ, వర్షాల బారిన పడకుండా నీడ కల్పించేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో జర్మన్ పెండల్స్‌ను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తన సొంత ఖర్చుతో వేయిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జర్మన్ పెండల్స్ పనులకు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ భూమిపూజ చేశారు. శాశ్వత ప్రాతిపదికన సుమారు రూ.10 లక్షలతో ఈ పనులు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గణపతి ఆలయం నుంచి యాగశాల వరకు జర్మన్ పెండల్స్ వేయిస్తున్నట్లు తెలిపారు. 10 రోజుల్లో పనులు పూర్తి చేయిస్తామన్నారు. అనంతరం ఆయన భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, ఆలయ ప్రధాన అర్చకులు శేషు, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన వసంత నవరాత్రి ఉత్సవాలు
భద్రకాళీ ఆలయంలో వైభవంగా జరిగిన వసంత నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. తొమ్మిదో రోజు శుక్రవారం ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం అనంతరం లక్ష గులాబీ పూలతో పుష్పార్చన చేశారు. అనంతరం చండీ హవనం, మహాపూర్ణాహుతితో వసంత నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లు ఆలయ ఈవో సునీత తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శించుకోగా, రాత్రి 7 గంటలకు సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

