హనుమకొండ చౌరస్తా, జూన్ 1: న్యూఢిల్లీ నుండి పద్మశ్రీ అవార్డు పొంది తొలిసారి వరంగల్ నగరానికి వచ్చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు వివిధ కులాల సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా వేయి స్తంభాల దేవాలయం ముందు అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్ మందకృష్ణ మాదిగను ఘనంగా సత్కరించి స్వాగతించారు.
మందకృష్ణ మాదిగ వేలాదిమంది సంఘాలతో ఊరేగింపుగా వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వస్తూ వేయి స్తంభాల దేవాలయం ఎదురుగా అర్చక సంఘాల నాయకులను చూసి ర్యాలీ వాహనం నుండి కిందికి దిగి ఆప్యాయంగా గంగు ఉపేందర్ శర్మను ఆలింగణం చేసుకొని పలకరించారు. వారికి పూలమాలతో గంగు ఉపేంద్ర శర్మ ఘనంగా సత్కరించారు. తాను ఎల్లవేళలా బ్రాహ్మణ అర్చక వర్గాలకు మద్దతుగా నిలుస్తానని అర్చక సంఘం లో 21 కులాలు అర్చకులు పూజలు చేయడం గొప్ప విశేషమని ఆయన పేర్కొన్నారు. ఆయనవెంట బీసీ ఉద్యమ నాయకుడు పృధ్విరాజ్ కూడా ఉన్నారు.