హనుమకొండ (ఐనవోలు): అర్చకుల పురువు ప్రతిష్టలకు, ఆత్మ అభిమానాల దెబ్బతిసే విధంగా ప్రయత్నాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 వేల దేవాలయాల ఆర్చకులం ఏకం కావాల్సిన పరిస్థితి వస్తుందని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి దేవస్థాన అర్చకుడు పాతర్లపాటి నరేశ్ శర్మ పై వస్త్రాలు సేకరించే టెండరుదారుడు చేసిన అభియోగాలను నిరసించారు. అర్చకులు, ఆలయ సిబ్బందిపై అభాండాలు వేయడం, భక్తుల మనోభాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేసి లబ్దిపొందలనుకోవడం శోచనీయమన్నారు.
ఈ మధ్యకాలంలో టెండారుదారులు ఆలయా సిబ్బంది పై చేయి చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు దిగితే సహించడానికి సిద్దంగా ఎవరు లేరని మేము కూడా దాడికి ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. దేవదాయశాఖ అధికారులు వెంటనే సదరు టెండారుదారుని లైనెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కార్యదర్శి తనుగుల రత్నాకరశర్మ, దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకరశర్మ, అర్చకులు నందనం భాను ప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శర్మ, దేవేందరశర్మ, సిబ్బంది తదితరులు ఉన్నారు.