కృష్ణకాలనీ, ఏప్రిల్ 28 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచిపోతుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెం కటరమణారెడ్డి అన్నారు. ప్రకృతి సైతం సహకరించిందని, సభ పూర్త య్యే వరకు చల్లటి వాతావరణం నెలకొందన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గండ్ర పాల్గొని మాట్లాడారు.
సభ విజయవంతానికి కృషి చేసిన నియోజకవర్గ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు కేసీఆర్ వివరిస్తే కొంతమంది మంత్రు లు ఆయన మాటలను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ ఇం డ్లు అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలకిచ్చిన ఏ ఒక హామీని నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు విలన్‌లాగా కనబడుతున్నదన్నారు. రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హడలెత్తుతున్నదని, ఆ భయంతోనే భూపాలపల్లి, మంథని, బెల్లంపల్లి నియోజకవర్గాల జనాలు సభకు వెళ్లకుండా ఉప్పల్, బావుపేట రైల్వే గేట్లను మూసివేసిందన్నారు. పోలీసులను ఎంత అభ్యర్థించినా తమ మాట వినలేదని, సభలో వారి సహాయ నిరాకరణ స్పష్టంగా కనపడిందన్నారు. తాము ప్రశ్నిస్తేనే కాంగ్రెస్ సర్కారు అల్లాడుతున్నదని, కేసీఆర్ ప్రశ్నిస్తే సీఎం రేవంత్ తట్టుకోగలడా? అని ప్రశ్నించారు.
ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. అలాగే ప్రజలంతా కేసిఆర్ పాలన కోరుకుంటున్నారని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని గండ్ర అన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల సంతోష్‌కుమార్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, మాజీ కౌన్సిలర్లు తిరుపతి, రవికుమార్, పూలమ్మ, నాయకులు సిద్దు, బేబి, పొలసాని లక్ష్మీ నరసింహారావు, కరీం, కరుణాకర్‌రెడ్డి, బుర్ర సదానందం, చిరంజీవి, మా డ హరీశ్‌రెడ్డి, రాజు, బుర్ర కుమారస్వామి, సుధాకర్ పాల్గొన్నారు.