కృష్ణ కాలనీ, డిసెంబర్ 13: పేదలకిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాసర్ గడ్డలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పట్టాలివ్వాలని 22 రోజులుగా లబ్ధిదారులు ధర్నా చేస్తుండగా, శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర స్థానిక బీఆర్ఎస్ నాయకుల తో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో భాసర్గడ్డలో 416 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి 2023 అక్టోబర్ 8వ తేదీన డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు కేటాయిస్తే, ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదైనా వారికి పట్టాలివ్వలేదన్నారు.
ఎందుకు జాప్యం చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు పేదలపై ప్రేమ ఉంటే వెంటనే ఎంపిక చేసిన 392 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలిచ్చి, వారిని గృహప్రవేశం చేయించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఫొటోల సోకు బాగుందని, లబ్ధి దారులతో గృహప్రవేశం చేయించి వారితో ఫొటో దిగాలని వా పోయారు. ఎమ్మెల్యే అండదండలతో కాంగ్రెస్ పార్టీ నా యకులు ఆయా వార్డుల్లో డబుల్ బెడ్ రూము ఇళ్లు ఇప్పిస్తామంటూ పైస లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు డబుల్ బెడ్ రూములు ఇ చ్చేందుకే ఫైల్ మిస్సయిందని కలెక్టర్ తప్పుడు సమాచా రం ఇస్తున్నాడని, నాడు పంపిణీ చేసిన వీడియో క్యాసెట్ బయటకు తీస్తే అసలైన లబ్ధిదారులు తెలిసిపోతారన్నారు.
కాంగ్రెస్ కార్య కర్తలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టబెట్టాలనే లక్ష్యంతో జాప్యం చేస్తున్నారన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివా స్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని లబ్ధిదారులకు పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాళాలు పగలగొట్టి ఇండ్లలోకి వెళ్తామని, ఎన్ని కేసులు పెట్టినా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించా రు. ఈ విషయంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబుకు వెంకటరమణారెడ్డి ఫోన్ చేయగా సానుకూలంగా స్పందించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలిచ్చేలా చూస్తామని చెప్పారన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొత్త హరిబాబు, మేకల రజిత, బానోత్ రజిత, ఎడ్ల మౌనిక, మంగళపల్లి తిరుపతి, దార పూలమ్మ, ముంజంపల్లి మురళీధర్, ఆకుదారు మమత, కో ఆప్షన్ మెంబర్ దొంగల ఐలయ్య, జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతిరావు, నాయకులు నాగుల దేవేందర్ రెడ్డి, బండారు రవి, చిరంజీవి, కరీం, మామిడి కుమార్, పోలవైన అశోక్, ఈశ్వర్, శ్రీకాంత్ పటేల్ పాల్గొన్నారు.
మాకు ప్రభుత్వం కేటాయించిన ఇండ్లకు పట్టాలివ్వకపోవడమే కాకుండా ధర్నా చేయడానికి వస్తుంటే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మా భర్తలకు ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టిస్తున్నరు. ధర్నాకు ఎందుకు పోతున్నమని నిలదీసున్నరు. ఎమ్మెల్యే దగ్గరకి పోతే నా దిష్టిబొమ్మ తగలబెట్టినా మీకు ఇండ్లు ఇవ్వనని అంటున్నడు. కలెక్టర్ వద్దకు పోతే పట్టించుకోవడం లేదు. రమణారెడ్డి సార్ మా బాధను పట్టించుకొని మాకు పట్టాలిప్పించేలా కృషి చేయాలి. గతంలో మీరే మాకు ఇల్లు ఇచ్చారు. పట్టాలిచ్చేంత వరకు కూడా మాకు మద్దతునివ్వండి.
– లబ్ధిదారులు మాధవి, రజిత