కృష్ణకాలనీ, అక్టోబర్ 6 : మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో గట్టి గా బుద్ధి చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లిలోని వేషాలపల్లి, మండలంలోని కొంపల్లి గ్రామంలో ఆయన ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను అం దజేస్తూ, వాటిలోని అంశాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా గండ్ర మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మనకు ఇవ్వాల్సిన బాకీని స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే పార్టీ నాయకులను తీర్చమని గ ల్లాపట్టి నిలదీయాలన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి దసరా పండుగకు చీర ఇచ్చి ఆడబిడ్డలను గౌరవించేవారని, కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చిన రెండేండ్ల నుంచి ఒకటీ ఇవ్వలేదన్నారు. విద్యార్థినులకు సూటీలు రాలేదని, నిరుద్యోగ భృతి గతి లేదన్నారు. రైతులకు కనీసం యూరియా బస్తా కూడా దొరకక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా మా రిందని, ఎవరూ సంతోషంగా లేరన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్లకోసం రైతుల వద్దకు తన్ని తరిమేసే పరిస్థితి గ్రామాల్లో నెలకొందన్నారు.
ఆ పార్టీ మోసాలను ప్రజలు గుర్తుంచుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నిక ల్లో ఓట్ల రూపంలో గుణపాఠం చెప్పాలన్నా రు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ పటేల్, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్‌యాదవ్, మాజీ కౌన్సిలర్లు బానోత్ రజిత, జుమ్ములాల్, మాజీ ఎంపీపీ రఘుపతిరావు, నాయకులు సెగ్గం సిద్దు, మందల విద్యాసాగర్‌రెడ్డి, మందల రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, దుండ్ర కు మార్, మోతే రాజు, పోలవేణి ప్రసాద్, గురిజాల శ్రీనివాస్, బీబీ చారి, రాజేందర్, రవి, నలిగేటి సతీశ్, బాలరాజు, అశోక్, కుమారస్వామి, ఓదెలు, సాంబయ్య, ప్రకాశ్ నాయక్, ముషె పద్మ, ఈర్ల స్వప్న పాల్గొన్నారు.