రాష్ట్రంలో రౌడీల రాజ్యం
కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చాక... తెలంగాణలో రౌడీలు రాజ్యమేలుతున్నార ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిపాలన చేతకాక, ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో కాంగ్రెసోళ్లు గూండాల్లా వ్యవహరిస్తూ, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
- కాంగ్రెస్ గూండాల పాలనలో ప్రజలకు రక్షణ లేదు..
- పాలన చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి
- క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చూసి కాంగ్రెసోళ్లు సిగ్గు తెచ్చుకోవాలి
- కాంగ్రెస్ ఎంపీల ఇండ్లల్లో ప్రధాని మోదీ బొమ్మ పెట్టుకుంటారా..?
- భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కృష్ణకాలనీ, ఏప్రిల్ 5: కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చాక… తెలంగాణలో రౌడీలు రాజ్యమేలుతున్నార ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిపాలన చేతకాక, ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో రాష్ట్రంలో కాంగ్రెసోళ్లు గూండాల్లా వ్యవహరిస్తూ, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అధికారిక క్యాంపు కార్యాలయంలో కాంగ్రెసో ళ్లు గూండాల్ల్లా చొరబడి సీఎం రేవంత్‌రెడ్డి బొమ్మపెట్టడం సిగ్గు చేటన్నారు.
కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వారి ఇండ్లల్లో ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ పెట్టుకుంటారా…? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు కేటాయించిన ఇండ్లల్లో వారికి నచ్చిన వాళ్ల ఫొటోలు పెట్టుకుంటారు.. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలు బలవంతంగా పెట్టడం కాంగ్రెసోళ్ల తెలివి తకువ తనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో సామాన్యులతోపాటు ప్రజాప్రతినిధులకు సై తం రక్షణ కరువైందని మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపై దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా.. లేన ట్టా?, పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి కాంగ్రెస్‌కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయాలు కట్టించారని, గ జ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూ పాలపల్లిలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవ్వుతున్నారని, ప్రజ లు స్వేచ్ఛగా జీవించాలంటే అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
ఇటీవలే ప్రవేశపెట్టిన మున్సిపల్ బడ్జెట్‌ను ఏదో తూతూ మంత్రంగా చదివి ఇదే బడ్జెట్ అని చెప్పడం హేయమైన చర్యన్నారు. జిల్లాలో మకజొన్న పంట చేతికొచ్చినా నేటికీ మకజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతు లు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, కౌన్సిలర్లు కట్ల పూర్ణచందర్, మోతె రాజు, జ్యోతుల మంజులావెంకటేశ్వర్లు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మేకల సంపత్‌కుమార్ యాదవ్, మా జీ కౌన్సిలర్ ముంజంపల్లి మురళీధర్, నాయకులు సింగనవేని చిరంజీవి, పిల్లలమర్రి నారాయణ, రత్నం అవినాశ్‌రెడ్డి, నరసింహచారి, లచ్చన్న, తిరుపతి, మహేశ్‌నాయక్, మహిళా నాయకులు భాగ్యలక్ష్మి, అంగోత్ స్వాతి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

