తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికి గంగమ్మ ఒడికి చేర్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలైన శోభాయాత్ర రాత్రి వరకు జోరందుకుంది. యువత కేరింతల మధ్య అంగరంగ వైభవంగా సాగింది.
దీంతో దారి పొడవునా సందడి నెలకొంది. ఈ సందర్భంగా మండపాల ఆధ్వర్యంలో యువకులు, మహిళలు, పిల్లలు నృత్యాలు చేస్తూ, డప్పులు వాయిస్తూ, రంగు లు చల్లుకుంటూ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ‘గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై.. పార్వతీ తనయుడు వినాయకుడికి జై’ అంటూ నినదించారు. అనంతరం చెరువులు, కాల్వలు, కుంటల్లో నిమజ్జనం చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 5