హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11: ఆదివాసులు-హక్కులు-అణిచివేత అవగాహన కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 24న ఉదయం 10 గంటలకు హనుమకొండ అంబేద్కర్ భవన్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మధ్యభారతంలో ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామన్నారు.
1996 పీసా చట్టం, 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి బస్తర్‌లో ఏర్పాటు చేసిన వందలాది సాయుధ బలగాల క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపివేసి శాంతిచర్చలను కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు, చంద్రమౌళి, పి.రమేశ్చందర్, ఆజాద్, శ్రావణ్‌కుమార్, కళావతి, జనుగాని కుమారస్వామి, బాలరాజు, శాంతక్క, వెంగల్రెడ్డి, ఇంద్రసేన, మహేష్, యాకుబ్, క్రాంతి, చంద్రమౌళి, సారంగపాణి పాల్గొన్నారు.