Free Medical Camp | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి ఆదేశాల మేరకు స్థానిక వైద్యాధికారి డాక్టర్ సుష్మిత ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మిత మాట్లాడుతూ రెండు ఉచిత వైద్య శిబిరాల్లో ఒకటి దేవస్థానం ముందు గల పాత కార్యనిర్వహణాధికారి ఆఫీస్ వద్ద, కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరొక ఉచిత వైద్య శిబిరం నిర్వస్తామన్నారు. ఈ నెల ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ ఈ ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు.
అత్యవసర చికిత్స నిమిత్తం రెండు ‘108’ అంబులెన్సులు ఉన్నాయని డాక్టర్ సుస్మిత తెలిపారు. వాటిలో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర, మరొకటి దేవస్థానం క్యాంపు దగ్గర ఉన్నాయన్నారు. అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ క్యాంపు డ్యూటీల్లో డాక్టర్లు, సూపర్ వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్స్లు, ఫార్మాసిస్ట్లు, ఏఎన్ఎం లు, ఆశ కార్యకర్తలు, కంటిజెంట్ వర్కర్లు విధులు నిర్వహిస్తారని ఆమె తెలిపారు.