కాజీపేట, ఏప్రిల్ 5: గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను కాజీపేట పట్టణంలో శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.20 వేల నగదుతో పాటు సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ సీఐ బాబూలాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కాజీపేట పట్టణ పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ బృందానికి విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బృందం ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన నలుగురు వ్యక్తులు గొడుగు శ్రీనివాస్, గొడుగు రమేష్, సముద్రాల శ్రీనివాస్, బోకరి సంతోష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. త ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.