అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ప్రతి డివిజన్‌ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 55 డివిజన్ భీమారంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బిషప్ ఉడుముల బాల, కార్పొరేటర్ జక్కుల రజిత-వెంకటేశ్వర్లతో కలిసి అరూరి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రతి సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేశామన్నారు.
- నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నిలుపుతా
- వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
- భీమారంలో ఎస్సీ కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపన
హసన్‌పర్తి, మార్చి 31: ప్రతి డివిజన్‌ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 55 డివిజన్ భీమారంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బిషప్ ఉడుముల బాల, కార్పొరేటర్ జక్కుల రజిత-వెంకటేశ్వర్లతో కలిసి అరూరి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రతి సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేశామన్నారు. అన్ని కులాల వారిని ఆర్థికంగా ఎదిగేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలోనే వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపడమే తమ లక్ష్యమన్నారు. అలాగే, అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం భీమారానికి చెందిన వలుస శివకు రూ. 1.50 లక్షల విలువైన సీఎంఆర్ఎస్ చెక్కును ఎమ్మెల్యే రమేశ్ లబ్ధిదారు ఇంటికెళ్లి అందజేశారు. ఇదే గ్రామానికి చెందిన గోరబోయిన పృథ్వీ, అటికం కొమురయ్య, బేతెల్లి అంకూస్ కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సంగాల విక్టర్‌బాబు, ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాయికంటి సుధాకర్, ఎర్రగట్టు ఆలయ చైర్మన్ చింతల లక్ష్మణ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఏ సురేశ్, యూత్ అధ్యక్షుడు సాయి, గాజాల గోవర్ధన్ పాల్గొన్నారు.
పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా
నయీంనగర్: పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని(సీఎంఆర్ఎఫ్) ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని తన నివాసంలో ఐనవోలు మండలం కక్కిరాలపల్లి, ఒంటిమామిడిపల్లి గ్రామాలకు చెందిన కాతా నాగయ్య, పెండ్లి జెన్నయ్యకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్వోసీని అందించారు. నాగయ్యకు రూ. 1.50 లక్షలు, జెన్నయ్యకు రూ. లక్ష మంజూరైనట్లు అరూరి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలెపల్లి శంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఎంపీటీసీలు దామెర అనూష, రాజు, రమేశ్, సర్పంచ్ కంజర్ల రమేశ్, నాయకులు రాఘవులు, పార్టీ గ్రామ అధ్యక్షుడు సంపత్, యాకయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

