పరకాల : జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో జరగనున్న బీఆర్ఎస్ రజతో సభకు పరకాలచ భూపాలపల్లి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తరలి వెళ్లారు. కాగా అమెరికా పర్యటనలో భాగంగా అమెరికాలో పెద్ద నగరాల్లో ఒకటైన హ్యూస్టన్ నగరంలోని పలు దేవాలయాలను సందర్శించారు.
హ్యూస్టన్లోని అష్టలక్ష్మి, శారదాంబ, షిరిడీ సాయి జలారాం దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా టెక్సాస్ లోని రిచ్మండ్ ప్రాంతంలో ఉన్న శారదా పీఠాన్ని మాజీ ఎమ్మెల్యేల బృందం సందర్శించారు. కాగా పర్యటనలో మాజీ ఎమ్మెల్యేలతో భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఉన్నారు.