 
                                                            హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 4 : వరంగల్ పశ్చిమ ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తల్లో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మనోధైర్యం నింపారు. సోమవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. దాస్యం ఓటమిని జీర్ణించుకోలేని కొందరు మహిళా కార్యకర్తలు విలపించగా ధైర్యం చెప్పారు. పశ్చిమ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, 20ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనకు తోడున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.
 
                            