హనుమకొండ, నవంబర్ 24 : మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాగా, నాయిని దిష్టిబొమ్మను దహనం చేసేందు కు, బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి డప్పుచప్పుళ్లతో వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
దీంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం దళిత సంఘాల నాయకులను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పోరేటర్ జోరిక రమేశ్ మాట్లాడుతూ అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే దళిత నాయకులపై అహంకారంగా మాట్లాడారని అన్నారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే నోరుకు అడ్డూఅదుపు లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. దళితుల జో లికి వస్తే ఊరుకునేది లేదని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత కా ర్పొరేటర్లు సంకు నర్సింగరావు, ఇమ్మడి లోహిత రాజు, సోదా కిరణ్ , మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు, నాయకులు కంజర్ల మనోజ్, పున్నంచందర్, కొండ్ర శంకర్, సదాంత్, కోటి, హరి నాథ్, గబ్బెట శ్రీనివాస్, మర్యాల కృష్ణ, వేణు, మంద సృజన్ కుమార్, స్నేహిత్, చక్రి తదితరు లు పాల్గొన్నారు.